మాదక ద్రవ్యాల దుర్వ్యసనానికి భారతదేశం గతంలో కూడా అతీతం కాదు కానీ, గడచిన ఐదేళ్లలో మాత్రం వాటి వినియోగం అమితంగా పెరిగిపోయింది. సంపన్న వర్గాల్లో తేరగా వచ్చే ఆదాయం పెరిగిపోవడం దీనికి ఒక ముఖ్య కారణం. మాదక ద్రవ్యాల ముఠాలు 1980లలో విద్యార్థులను తమ ప్రధాన లక్ష్యాలుగా చేసుకునేవి. ఇప్పుడవి ఎగువ మధ్యతరగతి ప్రజలందర్నీ లక్ష్యంగా చేసుకున్నాయి. దానివల్ల మధ్య వయస్కులకూ, విందు వినోదాల్లో తేలే వారికీ కొకైన్ ఒక జీవనశైలిగా రూపుదిద్దుకుంటోంది. బహుళ జాతి సంస్థల మాదిరిగానే అంతర్జాతీయ మాదక ద్రవ్య సిండికేట్లు కూడా భారతీయ నగర విపుణుల్ని కొల్లగొట్టుకోవడానికి ఉరకలు పెడుతున్నాయి. అందుకు నిదర్శనం మాదక ద్రవ్యాలను పంచుతున్న నేరంపై నైజీరియా, టాంజానియా, కెన్యాలకు చెందిన ఎంతోమంది ఇప్పుడు భారతీయ జైళ్లలో మగ్గుతుండటం.
గంజాయి, హెరాయిన్, యాసిడ్ (ఎల్ఎస్‌డి)లు చాలా కాలంగా వాడుకలో వున్నాయి. 'కుక్‌డ్ కొకైన్' ఇటీవల వ్యాప్తిలోకి వచ్చింది. అది పొడి రూపంలో వస్తున్న స్వచ్ఛమైన కొకైన్. దానినే ఫ్యాషన్‌గా రిక్రియేషనల్ అనీ, యుప్పీ అనీ, షాంపేన్ అనీ, కేవియర్ ఆఫ్ డ్రగ్స్ అనీ వర్ణిస్తున్నారు. కోక్ గ్రాముకి 5 వేల నుంచి 6 వేల వరకు ధర పలుకుతోంది. సులువుగా, వేగంగా రెండు చేతులతో సంపాదిస్తున్న వృత్తి నిపుణుల పుణ్యమా అని దీనికి గిరాకీ పెరిగిపోయింది. యువకుల జీవితాల్లోకి వ్యాపిస్తున్న ఇతర మాదక ద్రవ్యాలలో 'డబుల్ డిప్స్' మరొకటి. అవి మరింత త్వరగా కిక్ ఇవ్వడం కోసం యాసిడ్‌లో ముంచి ఇచ్చే ఎక్‌స్టసీ మాత్రలు. కొకైన్, ఎక్‌స్టసీలకు అప్పటికే అలవాటుపడిన వ్యక్తి సిఫార్సు మీద మాత్రమే అవి వాటి విక్రేతల వద్ద లభిస్తాయి. రసాయనిక పరమైన మందులతో భారతదేశానికి వచ్చి గంజాయి లాంటి వాటిని తిరిగి తీసుకువెళ్లే విదేశీ పర్యాటకుల నుంచి వీటికి ఎక్కువ గిరాకీ లభిస్తోంది. ప్రధానంగా కొకైన్ దక్షిణ అమెరికా నుంచి భారత్‌కు వివిధ మార్గాల ద్వారా తరలి వస్తోంది. భారతదేశపు రేవులలో ఆగివెళ్లే ఓడల ద్వారా, ప్రయాణీకుల సామాను ద్వారా అది సులభంగా దేశంలో ప్రవేశిస్తోంది. కొందరు కొకైన్‌తో నింపిన క్యాప్సూళ్లను మింగి, తనిఖీలు పూర్తయి దేశంలో ప్రవేశించిన తర్వాత తిరిగి కక్కుకుని, ఆ క్యాప్సూళ్ల నుంచి కొకైన్ పొడిని వేరుచేసి, ఖాతాదారులకు సరఫరా చేస్తారు. జనసమ్మర్దం బాగా వున్న చోట్లలోనే సరఫరాదారు అత్యంత రహస్యంగా సరకును కొనుగోలుదారునికి అందజేస్తాడు. సరకును సరఫరా చేయడానికి ముందే డబ్బు చెల్లింపు జరిగిపోయేలా చూసుకుంటారు. కొనుగోలుదారుని గుర్తించడానికి ప్రత్యేకమైన సంకేతాలను, ఏదైనా విదేశీ భాష నుంచి తీసుకున్న పదాలలాంటి ప్రత్యేకమైన గుర్తులను ఉపయోగిస్తారు. బాగా తెలిసిన ఖాతాదారులకు కొందరు నైజీరియన్లు సరకును ఇంటికే తెచ్చి అందజేస్తారు కూడా. వేదికలను ఎప్పుడూ సిండికేట్‌లే నిర్ణయిస్తాయి. కొనుగోలుదారులు ఆయా స్థలాలకు వెళ్లి మాదక ద్రవ్యాలను సేకరించుకోవలసి వుంటుంది.
ఆమోదం పొందాలనే ఆరాటంతోనో, లేక విపరీతమైన పనితనాన్ని చూపించవలసి వచ్చిన ఒత్తిడితోనో ప్రజలు మాదక ద్రవ్యాల బారిన పడతారని నిపుణులు భావిస్తున్నారు. పోటీ పెరిగిపోయిన పని వాతావరణాలు, ఉధృతమైన ఒత్తిడులు మధ్యతరగతి నిపుణులను మాదక ద్రవ్యాల పాలు చేస్తున్నాయి. కుటుంబ విలువలు విచ్ఛిన్నం కావడం, కుతూహలం, పిచ్చెక్కిస్తున్న పోటీ కూడా మాదక ద్రవ్యాల వినియోగం పెరగడానికి మరికొన్ని కారణాలు. భావోద్వేగ సమస్యలు, స్నేహితుల నుంచి వచ్చే ఒత్తిడులు, చేతిలో డబ్బు బాగా ఆడడం యువకులలో, పెద్దలలో, వృత్తి నిపుణులలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుండడానికి మరికొన్ని కారణాలు.
ఈ కొత్త ధోరణికి మహిళలు పెద్ద సంఖ్యలో ఖాతాదారులు కావడం ఆసక్తిగొలిపే పరిణామం. చాలామంది మోడల్స్ కోక్‌కు అలవాటు పడిపోతున్నారు. దానిని ఒకసారి వాసన చూస్తే ఆకలి నశిస్తుంది. చాలా గంటల పాటు శక్తివంతంగా వుండేటట్లుగా చేస్తుంది. అందుకే అది సన్నబడేందుకు సరికొత్త సాధనంగా అవతరిస్తోంది. ఆహారం ప్రమేయమే లేకుండా, లేదంటే ఆహార ప్రమేయాన్ని బాగా తగ్గించి, పార్టీలను ఎనర్జీ డ్రింకులకు, మాదక ద్రవ్యాలకు పరిమితం చేయడానికి కారణం ఇందులో వెల్లడవుతుంది. మహిళలు అనేక సమస్యల నుంచి తప్పించుకోవడానికి కూడా ఒక మార్గంగా మాదక ద్రవ్యాలను ఆశ్రయిస్తున్నారు. మాదక ద్రవ్యాలు అన్నింటికీ దుష్ప్రభావాలు ఉన్నాయంటే చాలామంది వ్యసనపరులు నమ్మడం లేదు. రక్తనాళంలోకి ఎక్కించుకునే మాదక ద్రవ్యాలను విరమించుకున్నప్పుడు కండరాల నొప్పులు, పేగులు మెలితిరగడం, గుండె దడ, దిగచెమటలు పోయడం వారికి కూడా బాగా తెలిసిన సంగతే. కానీ కొన్నింటిని మానినప్పుడు బాధలు అంత తీవ్రంగా ఉండకపోవడం వల్ల ఏమీ కాదనే ధీమాతో వారు వ్యవహరిస్తున్నారు. అయితే ఆందోళన, గుండె జబ్బులు, నొప్పి తెలియకపోవడం, చిత్త భ్రమలు, కలవరం, ఇతర మానసిక సమస్యలు ఎన్నోవాటికి కూడా అనుబంధంగా కలుగుతూనే ఉన్నాయి. అన్నింటినీ మించి మాదకద్రవ్యాల మీద ఆధారపడటం వల్ల జీవరసాయనికంగా, మానసికంగా, సామాజికంగా దెబ్బతినడం, మందులలోని రసాయనిక పదార్ధాలు నాడీ వ్యవస్థ మీద దాడి చేయడం, తీవ్రమైన ప్రవర్తనలు, కాలక్రమంలో ఆత్మీయులతో సంబంధాలు విచ్ఛిన్నం కావడం జరుగుతాయి.
భారతదేశంలో కొకైన్‌పై వ్యసనపడుతున్న వారి సంఖ్య రానురానూ పెరుగుతోందని అధికారులు నిర్ధారిస్తున్నారు. సమస్య మూలం అంతా సామాజిక విలువలు పతనం చెందడంలోనూ, భారతదేశ ఎగువ మధ్యతరగతి ప్రజానీకంలో నైతిక విలువలు పతనం చెందడంలోనూ ఎక్కువగా దాగి వుంది. కొత్తగా సాధిస్తున్న ఆర్థిక వికాసానికి మూల్యాన్ని భారతదేశం ఈ రూపంలో చెల్లిస్తున్నదేమో అని కూడా అనిపిస్తుంది.

No comments:
Post a Comment