January 6, 2010

మా ప్రశాంత్ గాడి లవ్ స్టొరీ ........

Love అంటే Loss  రా...
Love అంతా Trash  రా...
Love చేస్తే నీ Life antha Smash  రా...

ఆహా నీకెలా తెలుసు ?


తెలుసు కనుకే చెప్తున్నా వినుకో......
ముద్దు ముద్దు మాటతోటి మాయ చేసెనే ఓ పోరి,
ముద్దులొలికే ఆ మాటచూసి గుండె జారెనే నాది,
ఓర చూపే చూసి నన్ను రెచ్చగొట్టెనో సారి,
ఓ చిన్ని నవ్వే నాలోని లవ్వే పుట్టించెనే తొలిసారి.

అవునా Next ఏమైంది.....?

కలలే నన్ను వలచి, కలలో నిన్ను తలచి, నిదురే వీడిందే నానుంచి,
నడిచే నిన్ను చూచి, నడకే నేను మరచి, అడుగే వేయకున్నా నీనుంచి,
త్వరగా ఈ కథ తేల్చి,  నిన్నే ప్రేమలో దించి,  కడుదాం మరో తాజ్ మహల్ అనిపించి....
ఆ అనిపించి ఏం చేశావ్...?
Fresh గున్నFloweru తీసి కింగ్ లా అడుగేసి,

దాచుకున్న ప్రేమనంతా ఒక్క మాటలో తెలిపేసి,
అందమైన ఆ నవ్వు చూసి ఎగిరి గంతేసి,
అంతులేని సంబరంతో మొదలయింది మా ప్రేమ పరుగులు తీసి,
అబ్బో మంచి Intresting గా ఉంది తరువాత.......?
ఊపందుకున్న మా ప్రేమను చూసి, ఊర్వశి లాంటి నా భామని చూసి, నా Image a నింగినంటేసి,
Late night calls చూసి, Street light కింద Walks చూసి, నా Friends a ఔరా అనేసి,
సినిమాలు వదలక చూసి, ఊరంత తెగ తిరిగేసి, చూడలేని వింతలెన్నో ప్రేమలో చూసి,
పగలంతా పనులే మరచి, రేయంతా నిదురే విడిచి, ప్రేమ మైకం నన్ను మైమరపించి, కాలమే తెలియక రెండేళ్ళు గడచి, అప్పుడు మొదలయ్యే అసలు తల పిచ్చి,
అవునా ఏం జరిగింది...?
ఊసులాడిన ఊర్వశేమో ఉన్నట్టుండి పెళ్ళంది, ఊరడించి ఊహలు రేపి ఊరు వదిలి పోయింది,
కలసి గడిపిన కాలమంతా ఒక్క మాటతో తెంచింది, నింగినున్న నా ఆశలే నేలకూల్చింది,
అయ్యో తరువాత ఏమైంది....?
Cell phone బిల్లు కాస్త లక్ష దాటింది,
గుండెలోని చిల్లు నాకే శిక్ష చూపింది,
చదువు కాస్త చిన్నగా కంచికెళ్ళింది,
అదుపు తప్పిన రైలు లాగా Life మిగిలింది,

మరి అందుకే నే చెప్పేదేంటంటే....!!!

Love నీకు Life కాదు,
Life లోన Wife రాకపోదు,
Knife లాంటి Life ని పాడు చెయ్యొద్దు,
పేరు కోసం ప్రేమలొద్దు,
ప్రేమ కోసం పాట్లు వద్దు,
ప్రేమ నీకు పాఠం నేర్పే Chance ఇవ్వొద్దు,
నీ ఆశయాన్ని వదలద్దు,
నీ లక్షమేదో మరవద్దు,
నీ తల్లిదండ్రులని విడవద్దు, ఇలాంటి ప్రేమలో మాత్రం పడొద్దు.

2 comments:

eedhaparam said...

ur kavitha is v v fine sent some more to me thank u

eedhaparam said...

ur kavitha exclent